
పయనించే సూర్యుడు అక్టోబర్ 14 ఖమ్మం జిల్లా బ్యూరో భావుసింగ్ నాయక్
ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో డిసిఓ కార్యాలయానికి సంబంధించిన ఒక వ్యక్తి చేతివాటం చూపించాడు ఒక రైతు తన ల్యాండ్ ని కానీ వేరే వారి యొక్క ల్యాండ్ కానీ కొనుగోలు అమ్మకాలు జరిగే క్రమంలో వారి భూమిని పట్టా చేయించుకోవాలన్నా కానీ ఎమ్మార్వో కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ ఆర్ఐ లాంటి వ్యక్తులు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకొని ఈ దందా కొనసాగిస్తున్నారు ప్రభుత్వ అధికారులు అయి ఉండి కూడా ప్రభుత్వం ద్వారా నెల నెల జీతాలు వస్తున్న గాని అవి సరిపోవటం లేదు అంటూ లంచాలకు దిగజారి మరి చెయ్యి చాపుతున్నారు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడు సర్వత్రం విమర్శలు మండల స్థాయిలో తారాస్థాయిలో వినిపిస్తున్న గాని మాకేం సంబంధం అన్నట్టుగా జిల్లా స్థాయి అధికారుల పనితీరు
ఈ తతంగం ఈ రకంగా కొనసాగుతున్న వీటిపై నోరు మెదిపే అధికారులు లేకపోవడం విడ్డూరంగా అనిపిస్తుంది జిల్లాస్థాయి అధికారుల ప్రమేయం ఏమైనా ఉందా అని మండల ప్రజలు గుసగుసలాడుతున్నారు రఘునాథపాలెం ఎమ్మార్వో కార్యాలయానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది వేలాది అప్లికేషన్ పెండింగ్లో ఉన్నప్పటికీ కొత్త రేషన్ కార్డులు తక్షణమే జారీ చేసినట్లు మండల ప్రజలు అనుకుంటున్నారు ఆర్ ఐ తోపాటు కార్యాలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు ఎమ్మార్వో కార్యాలయంలో ఏ పని జరగాలన్నా కానీ ముందు అధికారుల దగ్గరికి వెళ్లే కంటే మధ్యవర్తుల దగ్గరికి వారి యొక్క అప్లికేషన్ తీసుకొని వెళ్లి చూపిస్తే అంటే అప్లికేషన్ పని రకాన్ని బట్టి డబ్బులు ముట్టిన తర్వాత అట్టి అప్లికేషన్ స్వయంగా మధ్యవర్తినే ఆర్ ఐ వద్దకు తీసుకెళ్లి అట్టి పనిని సులువుగా చేపించడం జరుగుతుందని మండల స్థాయిలో విమర్శలు వినబడుతున్నాయి ఈ విధంగా లంచాలకి పాల్పడుతున్న అధికారులు జిల్లా కేంద్రం కు కూత వేటు దూరంలోనే రఘునాధపాలెం ఎమ్మార్వో కార్యాలయం ఉంది మరి జిల్లా స్థాయి అధికారులకు ఈ పేద ప్రజల గోడు వినిపించడం లేదా లేదా గ్రామ స్థాయి నుండి మండల స్థాయి జిల్లా స్థాయి వరకు అధికారులు అంతా ఒకే బడి పాఠాలు నేర్చుకున్నారా అనేది అర్థం కావడం లేదు అని పేద ప్రజలు వారి ఇబ్బందులను ఈ విధంగా తెలియపరుస్తున్నారు