
పయనించే సూర్యుడు న్యూస్ నల్గొండ సెప్టెంబర్ 16. ఎనిమిదేండ్ల బాలికపై లైంగికదాడి కేసులో నల్లగొండ పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. దోషికి 21 ఏండ్ల జైలు శిక్షతోపాటు రూ.30 జరిమానా విధించింది. 2018, ఫిబ్రవరిలో చిట్యాల పోలీసు స్టేసన్‌లో ఈ ఘటనపై కేసు నమోదయింది. 2022 నుంచి నల్లగొండ పోక్సో కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం పోక్సో కోర్టు ఇన్చార్జి జడ్జి రోజారమణి తీర్పు వెలువరించారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే మూడో తరగతి చదువుతున్న ఓ బాలికపై లైంగికదాడి చేసిన కేసులోని నేరస్థుడికి నల్లగొండ కోర్టు 21 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెల్లడించింది. చిట్యాల మండలం వనిపాకల గ్రామానికి చెందిన దోమల రాములు 2018, ఫిబ్రవరి 1వ తేదీన 3వ తరగతి చదువుతున్న ఎనిమిదేండ్ల బాలిక ఇంట్లోకి ప్రవేశించాడు. విద్యార్థిని టీవీ చూస్తుండగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి అదే ఏడాది ఫిబ్రవరి 11న చిట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు 91/2018 క్రైం నెంబర్‌తో చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. యూ/ఎస్ 448,506,376(2)(ఐ) ఐపీసీ సెక్షన్ 5(ఎం) ఆర్/డబ్ల్యూ 6 ఆఫ్ ఫోక్సో చట్టం 2012 ప్రకారం చార్జిషీట్ దాఖలు చేస్తు కోర్టులో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి వాయిదాలపై నడుస్తూ 8 ఏండ్ల సుదీర్ఘ విచారణ అనంతరం పోక్సో కోర్టు న్యాయమూర్తి రోజారమణి, సాక్షధారాలను, కేసు పూర్వపరాలను పరిశీలించి తుది తీర్పు వెల్లడించారు. ఈ కేసులో నిందితునికి 21 సంవత్సరాల కారాగార శిక్ష, రూ.30 వేల జరిమానా విధించారు. బాధితురాలికి రూ.10లక్షలు కంపెన్సేషన్ ఇవ్వాలని ఆదేశించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ కేసులో ఐవోలుగా కె. భాస్కర్ రెడ్డి, డి.సైదులు బాబు, కె.పాండు రంగారెడ్డి, భరోసా లీగల్ ఆఫీసర్ మామిడి కల్పన, కోర్టు లైజనింగ్ అధికారులు పి. నరేందర్, ఎన్ మల్లిఖార్జున్ కీలకంగా వ్యవహరించారు. నేరస్థుడికి శిక్ష పడటానికి సహకరించిన పోలీస్ అధికారులను, కోర్టు సిబ్బందిని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు