
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 14 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి
79 వ భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమంలో భాగంగా బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్ కె పి హెచ్ బి పోలీస్ స్టేషన్ ముందు ఎస్సై శ్రీనివాస్ యాదవ్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది మరియు బీజేవైఎం నాయకులతో కలిసి జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఇంటి మీదనే కాకుండా ప్రతి కార్యాలయంలో జాతీయ జెండాను ఏర్పాటు చేసుకొని జాతి ఐక్యతను చాటాలని అన్నారు. స్వాతంత్రం కోసం పోరాటం చేసిన పోరాట వీరుల చరిత్రను అలాగే బ్రిటిష్ బానిసత్వపు రోజుల నుండి స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే రోజుల వరకు సాగిన స్వాతంత్ర సమర చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హార్ ఘర్ తిరంగ్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరినీ జాతీయ నిర్మాణంలో భాగస్వామ్యులను చేస్తున్నారు అని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామకృష్ణారెడ్డి, సందీప్, నాయకులు విశాల్, జయరాం, పవన్, రంజిత్, మహిళా పిసి సంగీత, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు….
