
పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్10) నార్పల మండలం చామలూరు లోని అంగన్వాడి కేంద్రం 2 నందు పోషణ పక్వాడ కార్యక్రమం సిడిపిఓ భారతి ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగినది కేంద్ర పరిధిలోని గర్భవతులను బాలింతను మరియు చిన్నపిల్లల తల్లులను సమావేశం పరచి నిర్వహించడం మొదటి 1000 రోజులలో పోషకాహారం యొక్క ప్రాముఖ్యతను గురించి సూపర్వైజర్ సునాలని వివరించారు ఒక గర్భవతి గర్భం దాల్చిన మొదటి రోజు నుండి తీసుకోవలసిన జాగ్రత్తలు అనగా పోషకాహారం వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత టీకాలు ముఖ్యంగా రక్తహీనత లేకుండా చూసుకోవడం సరైన విశ్రాంతి వంటివి పాటిస్తే కాన్పు సులువుగా జరుగుతుంది. పుట్టిన బిడ్డ సరియైన బరువుతో ఆరోగ్యంగా ఉంటుంది నెలనెలా బరువు తీయించుకోవడం HB% టెస్ట్ చేయించుకోవడం డాక్టరు పర్యవేక్షణలో మందులు వాడాలి అనంతరం గర్భవతులు బాలింతలు మరియు రెండు సంవత్సరాల్లోపు పిల్లలు ఇళ్లకు ప్రత్యేక గృహ సందర్శన చేయాలి వ్యాధి నిరోధక టీకాల పట్టికను పరిశీలించి సరియైన సమయంలో అన్ని టీకాలు వేయించాలని సూపర్వైజర్ తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త రామాంజనమ్మ మరియు తల్లులు పాల్గొన్నారు