ప్రజలకు ప్రభుత్వానికి వారధి జర్నలిజం.. ఏసీపీ శ్రీనివాస్ జి.
పయనించే సూర్యుడు: డిసెంబర్ 11: హుజురాబాద్ సౌండ్ రిపోర్టర్ దాసరి రవి: 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన ఉజురాబాద్ శ్రీనివాస్ జి, బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. హుజురాబాద్ పోలీస్ స్టేషన్ లో ప్రజా ప్రతిభ న్యూస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఆర్సి ఇన్చార్జి ఇప్పకాయల సాగర్ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగినది. ఈ సందర్భంగా ఏజిపి మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పని చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ప్రజాప్రతిభ పేపర్ కృషిని అభినందించారు. హుజురాబాద్ ప్రాంతానికి సంబంధించిన వార్తలు నిత్యం ప్రచురిస్తున్న ఆర్సి ఇంచార్జ్ ఇప్ప కాయల సాగర్ ను అభినందించారు. బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతిభ దినపత్రిక నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయడానికి నిష్పక్షపాతంగా ముందుకు పోతున్న ప్రతిభ దినపత్రికలు అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కరీంనగర్ అధ్యక్షులు చిలుకామారి శ్రీనివాస్ బీసీ సంఘం చందుపట్ల జనార్ధన్ మాజీ సంధ్యాల వెంకన్న ప్రజా జనహితం దినపత్రిక టీం జూపాక శివమణి రావుల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.