
పయనించే సూర్యుడు మార్చు 12 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు.ఎన్టీఆర్ జిల్లా: తిరువూరులో విలేఖరుల సమావేశం నిర్వహించిన-సీపీఐ జిల్లా కార్యదర్శి ధోనేపూడి శంకర్. ఐదారు జిల్లాలకు సంబంధించిన చింతలపూడి ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేవలం 30కొట్లే కేటాయించింది. పాడైపోయిన లాకులు బాగు చేయటానికి కూడా ఈ 30కోట్లు సరిపోవు. ఎవరికి వారు తమ నియోజకవర్గాల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించారు. స్థానిక ఎంఎల్ఏ అసెంబ్లీలో గళం విప్పాలి కదా. చింతలపూడి ఎత్తిపోతల పథకంపై కమ్యూనిస్టు పార్టీ అనేక దఫాలుగా ఉద్యమాలు చేసింది. బడ్జెట్లో ఇది..గతంలో మాజీ మంత్రి దేనినేని ఉమా అద్భుతంగా ఎత్తిపోతల పథకం అయిపోయిందన్నాడు. తిరువూరు పట్టణంలో 1500 టిడ్కో ఇళ్లు శిథిలా వ్యవస్థకు చేరడంతో పాటు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారాయి. అసెంబ్లీ కార్యక్రమాలు ముగిసేలోగా టిడ్కో ఇళ్లపై ఒక స్పష్టమైన ప్రకటన రావాలి. కట్టలేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి ఇప్పటివరకు ఎటువంటి కార్యచరణ చేపట్టలేదు. జాతీయ రహదారి-30పై రామచంద్రపురం గ్రామంలో ఎన్నో ఏళ్లుగా హైవే రోడ్డుపై భారీ గోతులు ఏర్పడ్డాయి. ప్రజల సమస్యలపై అధికార పార్టీ నాయకులు దృష్టి పెట్టాలి. కాకర్ల శివారులో వ్యవసాయ ఆధారిత అటవీభూములు ఉన్నాయి. అక్కడ పరిశ్రమలో నెలకొల్పాలి, ఇవాళ ఎలాగో నిరుద్యోగ భృతి సున్నా..కాబట్టి యువతకు ఉపాధి కల్పించాలి.