22/01/2025 పయనించే సూర్యుడు వెంకటాపురం మండలం రిపోర్టర్ బట్టా శ్రీనివాసరావు:-ములుగు జిల్లా వెంకటాపురం మండలం లో పత్రపురం గ్రామపంచాయతీ లో ప్రభుత్వం ప్రజా పాలన హామీలపై ప్రతీ ఒక్కరికి ప్రభుత్వపథకాలు చేరాలని ఈ గ్రామసభ లో అరులైన అందరికి రైతు భీమా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డు ఇంకా అన్నీ సంక్షేమ పథకాలపై అర్హులైన లబ్దిదారుల ఎంపిక కై ప్రజల వద్ద నుండి దరఖాస్తులు స్పీకరించారు ఇదివరకు సర్వేలో జరిగిన ఇందిరమ్మపథకానికి ఇల్ల దరఖాస్తు దారుల పేర్లు ప్రకటించి దశల వారిగా అందరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని , ఇంటి స్థలం లేనివారికి స్థలం కేటాయిస్తామని , ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అర్హులైన నిరుపేదల కు రెండు దపాలకిందా 12000/- రూ ప్రభుత్వం ఇస్తుందని రైతు భరోసా ఒక ఎకరానికి 6000/-రూ ఈ నెల 26 న అందరి అకౌంట్ లో పడతాయని అన్నారు ఈ గ్రామ సభలో తహసీల్దార్ ఎం లక్ష్మిరాజయ్య , సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి రవికుమార్ , సబ్ ఇన్స్పెక్టర్, తిరుపతి పోలీస్ శాఖ సిబంది ఎం పి పి సయ్యద్ హుషేన్ సెక్రటరీ, అంగన్వాడీ టీచర్స్, ఆశవర్కర్సు గ్రామస్తులు పాలుగోన్నారు