
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 16, కాకినాడ జిల్లా ప్రతినిధి కాకినాడ రూరల్ (బి వి బి) సామాజిక, ఆర్థిక, రాజకీయ ,సంస్కృతిక తేడాలు లేకుండా ప్రజలంతా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందని న్యాయవాది రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. రమణయ్యపేట లో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం పురస్కరించుకుని జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు .ప్రజలలో ప్రజాస్వామ్య సూత్రాలను ప్రోత్సహించడం, అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ప్రతి ఏటా సెప్టెంబర్ 15న అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం గా జరుపుకుంటామన్నారు. ప్రజాస్వామ్యం అనేది ఒక రాజకీయ భావన లేదా ప్రభుత్వ ఏర్పాటు విధానమని ఇందులో ప్రజలు నిర్ణయాలు కలిగి ఉంటారన్నారు. సమాజంలో అందరికీ సమాన హక్కులు, స్వతంత్రంగా ఉండటం అనే నియమాలను ప్రజాస్వామ్యం అనుసరిస్తుందన్నారు. ప్రజల చేత, ప్రజల కొరకు ,ప్రజలే ఎన్నుకునే విధానమే ప్రజాస్వామ్యం అని పట్నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, సత్యనారాయణ చౌదరి, నిమ్మకాయల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.