
పయనించే సూర్యుడు జూలై 6 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి. ఆదేశాల మేరకు కిమ్స్ డైరెక్టర్ తాళ్ళూరి గిరినాయుడు సూచనలతో శనివారం సాయంత్రం చేజర్ల మండలంలోని ఎన్.వి కండ్రిక . కొలపనాయుడు పల్లి గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి సంవత్సర కాలం ప్రభుత్వ పనితీరు వివరించి ప్రజల అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేజర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు .షేక్ సిరాజుద్దీన్ క్లస్టర్ ఇంచార్జ్ నల్లబోతు శివకృష్ణ ,టీడీపీ నాయకులు ఆదినారాయణ రెడ్డి,అచ్చాల నారాయణ రెడ్డి,భారత్ మహాసేన నాయకులు జువ్విగుంట బాబు,అచ్చాల చెంచు సుబ్బారెడ్డి,బిల్లుపాటి వెంకటేశ్వర్లు,దాసరి ప్రసాద్ ,టీడీపీకార్యకర్తలు గ్రామస్థులు పాల్గొన్నారు