
భూతాపాన్ని నియంత్రించాలి
పయనించే సూర్యుడు బాపట్ల ఏప్రిల్ 23:- రిపోర్టర్ (కే శివ కృష్ణ )
నానాటికి అధికమవుతున్న భూతాపం వల్ల,కొన్నాళ్లకు భూగోళం మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. హరిత జీవనశైలిని అలవర్చుకొని, భూమిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అని జిల్లా అటవీశాఖ అధికారి ఎల్ భీమయ్య చెప్పారు. మంగళవారం ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. సహజ వనరులను విచ్చలవిడిగా కొల్లగొట్టడం మాని, భావితరాల వారి అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎస్ ఎం జి జూనియర్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ జి దుర్గా ప్రసాదరావు అధ్యక్షత వహించారు. పుడమి తల్లి హక్కులపై అందరూ అవగాహన పెంచుకొని, వాటి పరిరక్షణకు పాటుపడాలని ఫోరం కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో ఇంకా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నాగమణి, హైస్కూల్ హ్ చ్ ఎం రమాదేవి, అధ్యాపకులు డాక్టర్ అబ్దుల్ కలాం, భాస్కర రావు, చిత్రకారుడు జీవి, సీనియర్ సిటిజన్స్ నాయకులు డాక్టర్ దేవవరం, జీవి బ్రహ్మం, నరసింహారావు, సత్యనారాయణ రాజు ఉపాద్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
