
కలెక్టర్ ను కలిసిన సింగరేణి అధికారులు
పయనించే సూర్యుడు ఏప్రిల్ 26 (పొనకంటి ఉపేందర్ రావు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లామణుగూరు సింగరేణి అధికారులు శుక్రవారం కలెక్టర్ జితేష్ వి పాటిల్ ని ఐడిఓసీలో కలిశారు.మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని కట్టు వాగు మరియు మెట్ల వాగు, పూడిక తీత పనులు మరియు మణుగూరు మున్సిపాలిటీ అంతా కూడా వరద ప్రభావిత ప్రాంతానికి గురి కాకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడానికి కలెక్టర్ ని కలిసి ప్రభుత్వంతో 83.25.లక్షలు కు గాను ఎం ఓ యు చేసుకున్నారు.సింగరేణి కాలరీస్ వలన సంస్థ చుట్టుపక్కలలో ఉన్న గ్రామాలలో అందరికీ కూడా విద్య, వైద్య సహాయం ఉద్యోగ సౌకర్యాలు కల్పిస్తూ చెరువులు, కుంటలు, వ్యవసాయం మౌలిక వసతులు తదితర అనేక ఇటువంటి సదుపాయాలు ప్రజలకు కల్పిస్తున్నందుకు సింగరేణి అధికారులను కలెక్టర్ అభినందించారు.ఎండ్ న్యూస్