
పయనించే సూర్యుడు ఆగస్టు 13 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలం పడమటి కండ్రిక వద్ద రహదారి తీవ్రంగా దెబ్బతినడంతో ఆ మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయం మీడియా ద్వారా పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ఇప్పటివరకు ఎటువంటి మరమ్మత్తు చర్యలు చేపట్టలేదు. రహదారి పరిస్థితి మరింత దిగజారడంతో, ఇటీవల జరిగిన ఆటో ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాలుకొనసాగుతున్న నేపథ్యంలో, మంగళవారం భారతీయ మహాసేన అధ్యక్షుడు జువ్విగుంట బాబు ఆధ్వర్యంలో సంఘం కార్యకర్తలు అక్కడ తాత్కాలిక భద్రతా చర్యలు చేపట్టారు. ఇసుక కట్టలు, కర్రలు అడ్డుగా పెట్టి ప్రమాద హెచ్చరికలను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా జువ్విగుంట బాబు మాట్లాడుతూ, ఇదే మార్గం ద్వారా కలువాయి మండలం, చేజర్ల మండలం అధికారులూ ప్రయాణిస్తున్నప్పటికీ ఇప్పటివరకు మరమ్మత్తులుజరగకపోవడం విచారకరమని అన్నారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడి. ప్రాణాలు కోల్పోయి ఉంటే దానికి బాధ్యత ఎవరిది అని ప్రశ్నించారు. తక్షణమే అధికారులు స్పందించి రహదారి మరమ్మత్తులు చేపట్టాలని, ప్రజల ప్రాణ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
