
- ప్రశాంతంగా జరుగుతున్న పదవ తరగతి పరీక్షలు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
- 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
పయనించే సూర్యుడు. మార్చి 26. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్, రిక్కా బజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షా సెంటర్ ను తనిఖీ చేసి, పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని అన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు చల్లని త్రాగు నీరు సరఫరా చేయాలని, పరీక్ష కేంద్రానికి వచ్చే ప్రతి విద్యార్థినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించాలని తెలిపారు. ఈ సందర్భంగా జరుగుతున్న పరీక్ష వివరాలు అడిగి తెలుసుకున్నారు రిక్కా బజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం జరుగుతున్న మ్యాథ్స్ పరీక్షకు 250 మంది విద్యార్దులను కేటాయించగా, 100 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, పరీక్షా కేంద్రాల్లో విద్యార్దులను చెక్ చేసి లోపలికి అనుమతిస్తున్నట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు. జిల్లా కలెక్టర్ పరీక్షా కేంద్రం తనిఖీ సమయంలో చీఫ్ సూపరింటెండెంట్ కె. శేఖర్ రావు, డిపార్ట్మెంట్ అధికారి ఎన్. శ్రీనివాస చారీ, సిట్టింగ్ స్క్వాడ్ సురేందర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఎంపిహెచ్ఏ (ఎం) సిహెచ్. శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.
