
బిజెపి పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు
జనం న్యూస్ // ఫిబ్రవరి //21//జమ్మికుంట //కుమార్ యాదవ్.. బిజెపి పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు ఆద్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని కృష్ణ కాలనీ, ఎంప్లాయిస్ కాలనీలలో పట్టభద్రుల, మరియు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని పట్టభద్రుల ఓటరు ఇంటింటికీ చేపట్టారు,ఈ సందర్భంగా కొలకాని రాజు మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు టీచర్స్, మరియు డిగ్రీ ఆపై స్థాయి విద్యావంతులు, మేధావులు వేసే ఎన్నిక అని, రానున్న రోజుల్లో నిరుద్యోగ యువత కొసం టీచర్ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే మరియు కొట్లాడే ఎన్నిక అని, అధికార పార్టీ లో ఉండే వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేరు,కాబట్టి ప్రశ్నించే గొంతుక వినిపిచాలంటే బిజెపి బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి ని టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య కు మొదటి ప్రాధాన్యత ఓటును 1 వెయ్యాలి అని అభ్యర్థించారు, ఈ కార్యక్రమంలో బిజెపి మహిళా మోర్చ జిల్లా అధికార ప్రతినిధి కంకణాల రమాదేవి, పట్టణ ఉపాధ్యక్షులు అప్పం మధు, పల్లపు రవి,బురుగుపల్లి రాము, కొండపర్తి ప్రవీణ్, ముకుందా సుధాకర్, కురిమిల్ల అశోక్, మడిశెట్టి శ్రీనాథ్, కేస స్వరూప, ముకుందా సాయి తదితరులు పాల్గొన్నారు.
