Saturday, June 14, 2025
Homeఆంధ్రప్రదేశ్ప్రెస్ నోట్13/06/2025చింతూరు.

ప్రెస్ నోట్13/06/2025చింతూరు.

Listen to this article

కలెక్టర్ గారు అక్రమ కట్టడాల కూల్చివేతల ప్రక్రియ లో ముందున్న చిత్త శుద్ధి ఎక్కడ?

అక్రమ కట్టడాలు కూల్చివేత మినహాయింపులు విషయం లో ఏ అధికారికి ఎంత వాటా అందిందో

చింతూరు మండల కేంద్రం మరియు చింతూరు డివిజన్లో ఎందుకు అక్రమ కట్టడాలు కూల్చివేత జరగటం లేదు. చింతూరు ఐ టి డి ఎ , పి ఓ గారు తెలపాలి


పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ జూన్ 13


గౌరవ సుప్రీంకోర్టు మరియు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అలాగే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్ అండ్ బి స్థలాల ఆక్రమణలు మరియు ఇతర ప్రభుత్వ భూములు, కాలువలు చెరువులు బరియల్ గ్రౌండ్లో లోని అక్రమ కట్టడాలను నాలుగు వారాల్లో తొలగింపు ప్రక్రియను పూర్తి చేస్తామని మొదట్లో ఎంతో చిత్తశుద్ధితో మాట్లాడిన జిల్లా కలెక్టర్ గారు మరి కొన్ని రోజులకి కొంతమంది ఆదివాసి ద్రోహులైన ఆదివాసి ప్రజాప్రతినిధులు మరియు ఆక్రమదారులైనటువంటి గిరిజనేతరులు యొక్క అభ్యర్థులను పరిగణంలోకి తీసుకొనిచాలా వరకి కూల్చివేత నిలిపివేసి గిరిజన యేతర అక్రమ కట్టడాలకు మినహాయింపు ఇవ్వటం వెనుక కలెక్టర్ గారి మరియు రెవెన్యూ అధికారుల ఉద్దేశం ఏమిటో బహిరంగ ప్రకటన ద్వారా తెలియజేయాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ (274/16)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను ప్రకటన ద్వారా కోరారు. చట్టం ఉల్లంఘనలో వున్న నాన్ ట్రైబల్ పై అధికారులకి, ప్రజాప్రతినిధులకి అంత ప్రేమ ఎందుకో ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన పత్రిక ముఖ్యంగా కోరారు. ఐదవ షెడ్యూల్ భూభాగంలో 1/70 చట్టం పకడ్బందీగా అమలు చేయాల్సినటువంటి అధికారులు, అమలకు చర్యలు తీసుకోవలసినటువంటి ప్రజాప్రతినిధులు నాన్ ట్రైబల్ కి కొమ్ముకాస్తూ, ఏజెన్సీ చట్టాలను నాన్ ట్రైబల్ కీ తాకట్టు పెట్టి ,అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు కాసులుకు కక్కుర్తి పడుతున్నారని ఆరోపణ చేశారు. ఒక జిల్లా కలెక్టర్ స్వయంగా మొత్తం కూలిస్తే నాన్ ట్రైబల్ వ్యాపారాలకు వాళ్ల నివాసాలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పటం ఎంతవరకు సబబు?, చట్టం ఉల్లంగించిన వాళ్ళు ఇక్కడ ఉన్నప్పటికీ వాళ్లని తొలగించకుండా కాపాడుకోవడం వాళ్లకి వత్తాసుగా కలెక్టర్ గారే స్టేట్మెంట్ ఇవ్వటం ఆదివాసుల దురదృష్టకరమని, ఇటువంటి అధికారుల నిర్లక్ష్యం వలనే, మరియు స్థానిక అధికారుల చేతివాటంతోనే 1/70 చట్టం అమల్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో చట్టానికి విరుద్ధంగా వలసలు పెరిగి నాన్ ట్రైబల్ అక్రమ కట్టడాలు వ్యాపార సముదాయాలు వెలిశాయని ఇది ఆదివాసుల ఉనికికి ప్రమాదము అని ఆవేదన వ్యక్తపరిచారు. ఆదివాసి ప్రజాప్రతినిధులు ఆదివాసులకు రాజ్యాంగం కల్పించిన చట్టాల వైప లేక ఓట్ల కోసం గిరిజయేతురులు ఇచ్చే కాసులు కోసం కక్కుర్తి పడి ఆదివాసులకు మోసం చేస్తారో తెలపాలని డిమాండ్ చేశారు. ఒకపక్క అధికారులు వాళ్ల పని వాళ్లు చక్కగా చేసుకుంటూ పోతున్న సమయం లో ఆదివాసి ప్రజాప్రతినిధులు గిరిజనయేతరుల దగ్గర కొమ్ముకాస్తూ అధికారుల పనికి అడ్డుపడటం సిగ్గుమాలిన చర్యగా ఆయన విమర్శించారు. అలాగే చింతూరు డివిజన్లోని చింతూరు, ఎర్రం పేట ఐటీడీఏ పరిధిలో నోటీసులు ఇచ్చి హడావుడి చేసిన ఐటీడీఏ ,రెవిన్యూ ,పంచాయతీ అధికారులు. కొంతమంది నాన్ ట్రైబల్స్ స్వతగా ఒకటి రెండు రేకులు తీసేయగానే పూర్తిగా అక్రమ కట్టడాలను కూల్చకుండా ఆపివేయడం వెనక అంతర్యం ఏమిటో తెలియజేయాలని, ఎంత ముడుపులు ముట్టాయో తెలపాలని ప్రశ్నించారు. కోదాడ రాజమండ్రి వంటి ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చినటువంటి కొంతమంది గిరిజన యేతరులు ఐటీడీయే లోనీ పలు కాంట్రాక్టు పనులు చేస్తూ. చింతూరు ఐటిడి అధికారులను గుప్పెట్లో పెట్టుకొని తమకు నచ్చినట్టు పని చేయించుకుంటూ చివరికి ఆదివాసి చట్టాలు కూడా తూట్లు పొడుస్తూ గౌరవ సుప్రీంకోర్టు, హైకోర్టు వారి ఆదేశాలు కూడా అమలు కాకుండా చేయగలిగారంటే చింతూరులో ఉన్న బడా గిరిజనయేత్రుల యొక్క రాజకీయ బలం ,డబ్బు బలం ఎంతుందో అర్థమవుతుందని, వారి ముందు అధికారులు కూడా దిగదుడిపే అని అర్థమైందని అన్నారు. పంచాయతీ అధికారుల నుండి ఐటీడీలో ఉన్న ఐఎయస్ అధికారులను సైతం తమ గుప్పెట్లో పెట్టుకుని గిరిజయేత్రులు చింతూరులో తమ ఉనికిని చాటుతున్నారని దీని మూలాన ఆదివాసీలకు, ఆదివాసి చట్టాలకు ఉనికి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తపరిచారు. చింతూరు ఎర్రంపేట కేంద్రాల తో పాటు చింతూరు డివిజన్లోని వర రామచంద్రపురం, కూనవరం, ఎటపాక మండలాల్లో వున్న అన్ని అక్రమ కట్టడాలు తక్షణమే కూల్చివేత మొదలు పెట్టాలని లేకపోతే అధికారులకి చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి గ్రామం నుండి ఆదివాసీలు రెవెన్యూ ,పంచాయతీ, ఐటీడీఏ, జిల్లా అధికారుల కు మరియు ఆదివాసి ప్రజాప్రతినిధులకు అలాగే అక్రమ కట్టడం దారులైన గిరిజయేతరులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు మొదలు పెట్టాలని పిలుపునిచ్చారు. ప్రధాన న్యాయస్థానం ఆదేశాలను పక్కనపెట్టి అక్రమ దారులకు కొమ్ముకాస్తున్న అధికారులపై, అధికారులను తమ పని చేయకుండా అడ్డుకుంటున్నటువంటి ప్రజాప్రతినిధులపై కోర్టు ధిక్కరణ కేసులు నమోదు చేయాలని ఆయన ఈ సందర్భంగా పత్రికా పరంగా న్యాయస్థానాన్ని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments