
ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి రాచేపల్లి సూర్య ప్రకాష్
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 16 న్యూస్నార్పల మండల కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, కనీస సౌకర్యాలు లేకుండా ఉషోదయ, సాయి విజయ్, షిరిడి విద్యానికేతన్ పాఠశాలలు తరగతులు నిర్వహిస్తున్నాయి. వీటి పైన తగిన చర్యలు తీసుకోవాలని సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నాడు ప్రజా పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి రాచేపల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ! నార్పల మండల కేంద్రంలో ఉన్నటువంటి ఉషోదయ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎనిమిదో తరగతి వరకు అనుమతి ఉంది అయినా ఏమాత్రం అనుమతి లేకుండా ఇష్టానుసారంగా పదవ తరగతి వరకు తరగతి నిర్వహిస్తూ ఏమాత్రం కూడా కనీస సౌకర్యాలు లేకుండా కూడా తరగతుల నిర్వహిస్తున్నారు. అదేవిధంగా విజయసాయి పాఠశాల మరియు శిరిడి సాయి విద్యానికేతన్ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేకున్నా రేకుల షెడ్లలో తరగతుల నిర్వహిస్తూ, ఏమాత్రం కూడా క్వాలిఫై టీచర్స్ లేకుండా చిన్న చిన్న తరగతి గదిలో నిర్వహిస్తూ, కనీసం విద్యార్థులకు మరుగుదొడ్డి సదుపాయం లేకుండా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈ మూడు పాఠశాలలు కూడా తరగతి నిర్వహిస్తున్నాయి. కనీస సౌకర్యాలు అయినటువంటి ఈ ప్రైవేట్ పాఠశాలలపై మండల అధికారులు ,జిల్లా విద్యాధికారులు చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాం.