
పయనించే సూర్యుడు బాపట్ల ఏప్రిల్ 6:- రిపోర్టర్( కే శివ కృష్ణ )
బాపట్ల:బడుగు జీవుల ఆశాజ్యోతి డా.బాబు జగ్జివన్ రామ్ అని జనసేన పార్టీ సీనియర్ నాయకుడు విన్నకోట సురేష్, గుంటూరు జిల్లా కార్యదర్శి గుంటుపల్లి తులసి కుమారి అన్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడిగా సంఘసంస్కర్తగా తన పరిపాలనలో అనేక విశేషమైన మార్పులు తీసుకువచ్చి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవడంతో పాటు అనేక సంక్షేమ పథకాలు పేదవాడికి అందే విధంగా కృషి చేసిన గొప్ప ఉప ప్రధానిగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కర్లపాలెం మండల అధ్యక్షుడు గోట్టిపాటి శ్రీకృష్ణ, బాపట్ల టౌన్ నాయకులు కారుమూరి అంజనేష్, తాండ్ర రాధకృష్ణ, కామిశేటి సాయిబాబు, పసుపులేటి మహేష్, దాసరి వినోద్, సంగీత ఏసోభు, కంచర్లపల్లి నరేంద్ర, కోకి రాజశేఖర్ రెడ్డి, పడమటి ధర్మారావు, చిలకల సురేంద్ర, గరిగంటి శ్రీనివాసరావు, మడసాని బాలాజీ, సాయిన రాంబాబు, సురినేని రాజేష్, గురాళ్ళ రామారావు తదితరులు పాల్గొన్నారు.