
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్ నగర్ తాలూకా జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు
గ్రేడ్ వన్ శాఖ గ్రంథాలయం అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్- జేఏసీ కన్వీనర్ నక్క బాల్ రాజ్ యాదవ్
( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 27 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
తెలంగాణలో పురుడుపోసుకున్న అన్ని ప్రజా ఉద్యమాలకు కీర్తిశేషులు కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రత్యక్ష సాక్షి అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.
షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో కీర్తిశేషులు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా జేఏసీ మరియు స్థానిక పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో
షాద్ నగర్ పట్టణంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు.షాద్ నగర్ తాలూకా జేఏసీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య, చెంది తిరుపతిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాల్ రాజ్ గౌడ్,పి.రఘు నాయక్,అగ్గనూరి బస్వం,మార్కెట్ కమిటీ డైరెక్టర్ జేఏసీ వైస్ చైర్మన్ కర్ణాకర్, ఇబ్రహీం,బాదేపల్లి సిద్ధార్థ,అర్జునప్ప, జంగారి రవి, తదితర మాజీ కౌన్సిలర్లు హాజరయ్యారు.