
భాధిత కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందజేస్తున్న దృశ్యం.. రుద్రూర్, మార్చ్ 17 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్, రుద్రూర్, అక్బర్ నగర్ గ్రామాలల్లో సోమవారం బాన్సువాడ నియోజకవర్గ బిజెపి నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ భాధిత కుటుంబాల ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి ఒక్కొక్కరికి 5000 వేల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందజేశారు. అలాగే అక్బర్ నగర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన వడ్ల రవి అనే వ్యక్తి అకాలంగా మరణించడంతో బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ వారి ఇంటికి వెళ్లి కుటుంబీకులకు దైర్యం చెప్పి వారికీ అండగా నేను ఉంటానని భరోసా నిచ్చి వారి కుటుంబానికి ఒకనెలకి సరిపడా నిత్యావసర సరుకులను, ఆర్ధిక సహాయం అందజేశారు. కోనేరు శశాంక్ ట్రస్ట్ ద్వారా వారి పిల్లల చదువుకి కావలిసిన సహాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ఏముల గజేందర్, మండల సీనియర్ నాయకులు రామ్ రాజ్, ప్రధాన కార్యదర్శి సాయినాథ్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు శివప్రసాద్, వినోద్ కుమార్, కేవీడీ సాయిలు, సాయికుమార్, కృష్ణం రాజు, తేజ, బూత్ అధ్యక్షులు, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
