
ఎల్ఓసిని అందజేస్తున్న కాంగ్రెస్ నాయకులు..
రుద్రూర్, సెప్టెంబర్ 2 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ గ్రామానికి చెందిన అప్పన్నకు మోకాల మార్పిడి శస్రచికిత్స కొరకు ఎల్ ఓసికి దరఖాస్తు చేసుకోగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా 80 వేల రూపాయల ఎల్ఓసి మంజూరు కావడంతో మంగళవారం కాంగ్రెస్ నాయకులు బాధితుడు అప్పన్నకు ఎల్ఓసి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మాజీ జడ్పిటీసి నారోజి గంగారం, నాయకులు పత్తి రాము, అక్కపల్లి నాగేందర్, పార్వతి ప్రవీణ్ పాల్గొన్నారు.