పయనించే సూర్యుడు నర్సాపూర్ నియోజకవర్గం ఇన్చార్జి మహేష్ జనవరి 10:
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే సరియైన వైద్యం అందించకపోవడంతోనే తమ తండ్రి మరణించినాడని మృతుని బంధువులు మండల కేంద్రమైన శివ్వంపేట శ్రీసాయి నర్సింగ్ హోమ్ ఎదుట బుధవారం ఆందోళన చేపట్టిన విషయం అందరికి విదితమే.ఇక వివరాలలోకి వెళ్తే గూడూరు గ్రామానికి చెందిన బోయిని బిక్షపతి యాదవ్ అనారోగ్యంతో ఈనెల 3న స్థానిక శ్రీసాయి నర్సింగ్ హోమ్ కు వెళ్లగా బిక్షపతి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో కొంపల్లిలోని శిఖర ఆసుపత్రికి తరలించామని, చికిత్స పొందుతూ ఈనెల 4న బిక్షపతి యాదవ్ మరణించినాడని బాధితులు చేపట్టిన ఆందోళనతో శ్రీసాయి నర్సింగ్ హోమ్ వైద్య సేవలపై వివాదం చెలరేగడంతో చేసేదేమిలేక నిర్వాహకులు ఆసుపత్రికి గురువారం తాళం వేసుకోవడం జరిగినది.