
పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 28. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బానోత్ ఈర్య నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్.. తిమ్మరావుపేట గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు బానోత్ ఈర్యా నాయక్ నిన్న సాయంత్రం అకాల మరణం విషయం తెలిసి ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఈ సందర్భంగా వారి కుటుంభానికి ప్రగాఢ సానభూతిని తెలిపారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మాచర్ల శ్రీను, మాజీ ఎంపీటీసీ గుగులోత్ లచ్చిరాం, కాంగ్రెస్ నాయకులు హెచ్. అయోధ్య, నన్నేఖాన్,వీరు నాయక్, పిచ్చయ్య, కొనకంచి రామకృష్ణ, గొంది శ్రీను, పాల్గొన్నారు