
పయనించే సూర్యుడు // న్యూస్ మే 8// నారాయణపేట జిల్లా బ్యూరో బి విశ్వనాథ్ //
నారాయణపేట జిల్లా కోటకొండ గ్రామంలో జిల్లా శిశు సంక్షేమ శాఖ మరియు గ్రామపంచాయతీ కార్యదర్శి చాణుక్య వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులకు బాల్య వివాహ చట్టం పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.. కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ 18 సం. లోపు ఆడ పిల్లలకు 21 సం లోపు మగ పిల్లలకు వివాహాలు జరుపకూడదని, పిల్లలను పనుల్లో పెట్టుకోకూడదని, నేటి బాలలే రేపటి పౌరులు అనే విషయాన్నీ గుర్తుచేశారు. అలాగే లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ జిల్లాలో ఆపదలో వున్నా బాలలను సంరక్సించడానికి 24 గం. 1098 అనే నంబర్ అందుబాటులో ఉంటుందని పిల్లలకు సంబందించిన ఎలాంటి సహాయం కావాలన్నా పై నంబర్ కు ఫోన్ చేసి తెలపవచ్చని చెప్పారు.గ్రామ కార్యదర్శి చాణుక్య వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మా గ్రామాన్ని బాల్య వివాహ రహిత గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.కార్యక్రమం లో సంక్షేమ శాఖ సిబ్బంది లక్ష్మణ్ నాయక్, శ్రావణ్ కుమార్, మాజీ సర్పంచ్, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్, యువజన సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


