Sunday, March 16, 2025
Homeఆంధ్రప్రదేశ్బిఆర్ఎస్ పార్టీ అధికారం పోయాక మతి స్థిమితం లేకుండా వ్యవహరిస్తోంది

బిఆర్ఎస్ పార్టీ అధికారం పోయాక మతి స్థిమితం లేకుండా వ్యవహరిస్తోంది

Listen to this article
  • స్పీకర్ పైన చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇల్లందకుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్..

పయనించే సూర్యడు // మార్చ్ // 16 // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ // కుమార్ యాదవ్..

టిఆర్ఎస్ పార్టీ అధికారం పోయాక మతిస్థిమితం లేకుండా వివరిస్తుంది అన్నారు ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్.. పెద్ది కుమార్ ఆధ్వర్యంలో, మాజీమంత్రి జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ దిష్టిబొమ్మలను దానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పెద్ది కుమార్ మాట్లాడుతూ…
శాసన సభలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్, ప్రోద్బలంతో స్పీకర్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ, బిఆర్ఎస్ మ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్, దిష్టి బొమ్మలను దహనం చేయడం జరిగిందన్నారు.బీఆర్ఎస్ పార్టీ అధికారం లేకుండా ఉండలేకపోతోంది.అని బీఆర్ఎస్ 10 సంవత్సరాల రాబందుల పాలన, చేసారని,వారి ప్రజా వ్యతిరేక విధానాలను త్రుంగలో తొక్కి, బీ ఆర్ ఎస్ అన్యాయాల అక్రమాల నుంచి తెలంగాణను విముక్తి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనకు ప్రజలు అవకాశం ఇచ్చారన్నారు. దీన్ని బీ ఆర్ ఎస్ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారని, ప్రజా నిర్ణయాన్ని స్వాగతించి అభివృద్ధిలో కలిసి రాకుండా నిత్యం శాపనార్థాలు పెడుతున్నారు, అని అబద్ధాలతో రాష్ట్రాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారన్నారు. అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో స్పీకర్ ని సైతం హేళన చేస్తూ, ఏకవచనంతో దూషిస్తూ, సభను, స్పీకర్ ని అవమానిస్తున్నారన్నారు. వీళ్ళ ఆగడాలను తెలంగాణ సమాజం గమనిస్తుంది.అని బీఆర్ఎస్ పార్టీకి అధికారం తప్ప ఇంకో లక్ష్యం లేదు, అని మాట్లాడారు.ప్రజలంటే గౌరవం లేదు, అని రాజ్యాంగ వ్యవస్థలంటే నమ్మకం లేదు,అని రాజ్యాంగ బద్దంగా ఉన్న స్పీకర్ అంటే కనీస గౌరవం లేదు., అని మండిపడ్డారు. ఈ రకంగా కేవలం అధికారం కోసం సభలో మరియు బయట ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తూ వారి పైశాచిక ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే మొద్దు నిద్ర వీడాలన్నారు. ఫామ్ హౌజ్ నుంచి బయటికి రావాలి,అని ఇదేనా మీ ఎమ్మెల్యేలకు తెలంగాణ భవన్ లో సమావేశం పెట్టి ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులుగా పని చేయండని హిత బోధ చేశారా అని కెసీఆర్ ని అడుగుతున్నాము అని అన్నారు. తెలంగాణ సబ్బండ వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి కుయుక్తుల్ని, కపట నాటకాలను ఆపకపోతే కాంగ్రెస్ పార్టీ సైనికులుగా బీఆర్ఎస్ నాయకులకు బుద్ది చెప్పే కార్యక్రమాలను తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడెపు సారంగపాణి, అన్నం ప్రవీణ్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పెద్ది శివ కుమార్, మీస రాజయ్య,గంగారపు మహేష్, కనుమల్ల సంపత్,, మారపెళ్లి ప్రశాంత్,కారింగుల రాజేందర్, దంశాని తిరుపతి,వెంకటేష్, గొడిశాల పరమేశ్వర్, మరపెళ్లి రమేష్, రావుల ఎల్లయ్య, గోలి కిరణ్,పెరుమాండ్ల రవి, మారపెళ్లి వేణు, గూడేలు ఓదెలు, మూడెత్తుల మల్లేష్, బొమ్మ శ్రీనివాస్, పెద్ది అభి, మూడెడ్ల రమేష్, రెడ్డి సారంగం,ఉప్పల ఐలరెడ్డి, బండి మల్లయ్య, బండి రాజశేఖర్, ఉప్పల మల్లారెడ్డి, గురుకుంట్ల స్వామి, గురుకుంట్ల రాజేందర్, కుమారస్వామి, రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments