
పయనించే సూర్యుడు ఏప్రిల్ 26 తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ శ్రీనివాస్ రెడ్డి : బీ ఆర్ ఎస్ పార్టీ రజతోత్సవం వేడుకల ముందు ఆ పార్టీ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కూకట్ పల్లి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆసిఫ్ ఖాన్ శనివారం కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండి రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బండి రమేష్ ఆసిఫ్ ఖాన్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆసిఫ్ ఖాన్ మాట్లాడుతూ త్వరలో కూకట్ పల్లి నుంచి తన ఆధ్వర్యంలో మరింత మంది కాంగ్రెస్ పార్టీ లో చేరుతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో రెండు దఫాలు కూకట్ పల్లి అధ్యక్షుడిగా చేశానని అన్నారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమంలో పాలు పంచుకుంటానన్ని, పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తానని అన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షుడు నాగిరెడ్డి, మూసా పేట మాజీ అధ్యక్షుడు చున్ను పాషా, నాయకులూ బాలానగర్ డివిజన్ ప్రెసిడెంట్ ఆర్, మధు గౌడ్, తదితరులు పాల్గొన్నారు