
పయనించే సూర్యుడు. ఏప్రిల్ 14. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు మండల ప్రధాన సెంటర్ నందు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ యువసేన మండల కమిటీ సభ్యులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో కేటీఆర్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈనెల ఏప్రిల్ 27న ఆదివారం నాడు వరంగల్ జిల్లా, ఎల్కతుర్తి లో జరుగు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, పార్టీ సానుభూతిపరులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయగలరని కేటీఆర్ యువసేన మండల కమిటీ సభ్యులు కోరారు. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం కేటీఆర్ యువసేన మండల కమిటీ ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉంటుందని, మా కేటీఆర్ యువసేన మండల కమిటీ వ్యక్తిగతంగా ఎవరికి వ్యతిరేకం కాదని పార్టీ అభివృద్ధి లక్ష్యంగా, కేసీఆర్ గారి నాయకత్వమే ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు భుక్యా వినోద్ కుమార్, భూక్య ధర్మానాయక్, గిరిజన మండల నాయకులు గుగులోత్ ఈశ్వర్ నాయక్, ముస్లిం మైనారిటీ ప్రెసిడెంట్ షేక్ చాంద్ పాషా, యూత్ ప్రెసిడెంట్ షేక్ బాజీ, వీరభద్రం, గుగులోత్ మజీలాల్, యాకుబ్ పాషా, శ్రీకాంత్, బానోత్ వినోద్, కాకటి దావీదు, గొల్లపూడి శివకృష్ణ, షరీఫ్ మరియు తదితరులు పాల్గొన్నారు..