
వినతి పత్రం అందజేస్తున్న దృశ్యం…
రుద్రూర్, జూలై 07 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
బీఎల్ఓలకు ట్రైనింగ్ మీటింగ్ జులై 9న కాకుండా మరుసటి రోజు నిర్వహించాలని బూత్ లెవెల్ ఆఫీసర్ లు సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం రుద్రూర్ డిప్యూటీ తహసీల్దార్ సురేందర్ నాయక్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బూత్ లెవెల్ ఆఫీసర్లు మాట్లాడుతూ, జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఉన్నందున సమ్మెలో పాల్గొననున్నట్లు నెల రోజుల క్రితం సంబంధిత అధికారికి సమ్మె నోటీసు అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. బీఎల్ఓల ట్రైనింగ్ జూలై 9న కాకుండా వరుసటి రోజు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకుడు నన్నేసాబ్, బీఎల్ఓ లు పద్మ, ప్రతిమ, గంగామణి, రూప, సుజాత తదితరులు పాల్గొన్నారు