Tuesday, May 13, 2025
Homeఆంధ్రప్రదేశ్బీసీ సేన ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం

బీసీ సేన ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం

Listen to this article

బీసీ సేన ఆధ్వర్యంలో మహిళల సన్మాన కార్యక్రమం, మున్సిపల్ కార్మికులకు చీరల పంపిణీ మహిళా శక్తే భారత భవిష్యత్! గౌరవించుదాం – సాధికారత పెంపొందించుదాం!

( పయనించే సూర్యుడు మార్చి 09 షాద్ నగర్ నియజకవర్గం ఇన్చార్జి మెగవత్ నరేందర్ నాయక్)

బీసీ సేన జాతీయ అధ్యక్షులు బర్క కృష్ణ ఆదేశాల మేరకు, షాద్‌నగర్ అసెంబ్లీ మహిళా అధ్యక్షురాలు బాస వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలను ఘనంగా సన్మానించడంతో పాటు, మున్సిపల్ కార్మికులకు చీరల పంపిణీ చేసి, వారి సేవలకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా బీసీ సేన జాతీయ అధ్యక్షులు బర్క కృష్ణ గారు, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు, కేశంపేట మండలం మాజీ జెడ్పీటీసీ తాండ్ర విశాల రెడ్డి , మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్ గారు తదితర ప్రముఖులు హాజరై, మహిళా సాధికారత, సమాజంలో మహిళల పాత్రపై ఉద్దేశపూర్వకంగా ప్రసంగించారు.సమాజ అభివృద్ధికి మహిళల పాత్ర అమోఘమని, వారిని అన్ని రంగాల్లో ముందుకు తేవాలని కోరారు.మహిళల భద్రత, హక్కుల పరిరక్షణ కోసం బీసీ సేన పూర్తి మద్దతునిస్తుందని స్పష్టం చేశారు.నగర పరిశుభ్రత, ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా కార్మికులను సన్మానించడం, వారికి మద్దతుగా నిలవడం బీసీ సేన ధ్యేయమని తెలిపారు.మహిళలకు సమాన అవకాశాలు అందించేందుకు బీసీ సేన కృషి చేస్తుందని, తద్వారా వారికి ఆర్థిక స్వావలంబన, సామాజిక గౌరవం పెరుగుతుందని చెప్పారు.మహిళా సంక్షేమం, బాలికల భద్రత, ఉద్యోగ అవకాశాలపై మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ప్రకటించారు.అతిథుల ప్రసంగాలు – సమాజానికి బలమైన సందేశంఈ కార్యక్రమంలో హాజరైన నాయకులు, మహిళా నేతలు మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, కేవలం నినాదాలు కాదు, నిజమైన సాధికారత కోసం చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.బీసీ సేన మహిళా విభాగం మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టాలని, మహిళా సాధికారత కోసం నిరంతరం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు“మహిళా శక్తి వెలుగులు నింపిన వేడుక!”ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన బాస వరలక్ష్మి నాయకత్వాన్ని అతిథులు ప్రత్యేకంగా ప్రశంసించారు. బీసీ సేన, మహిళా విభాగం, కార్యకర్తలు అందరూ ఏకమై ఈ వేడుకలను ఘనంగా నిర్వహించడాన్ని హర్షించార.మహిళా సాధికారత మాటల్లో కాదు కార్యాల్లో చూపుదాం!సమాజం అభివృద్ధి చెందాలంటే, మహిళలకు గౌరవం పెరగాలి! బీసీ సేన తరపున, దేశంలోని ప్రతి మహిళా శక్తికి మనఃపూర్వక వందనం! ఈ కార్యక్రమంలో బీసీ సేన షాద్ నగర్ అసెంబ్లీ అధ్యక్షులు కత్తి చంద్రశేఖరప్ప అసెంబ్లీ కోశాధికారి అసెంబ్లీ మహిళా అధ్యక్షురాలు మాస వరలక్ష్మి ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి సౌజన్య ఉపాధ్యక్షురాలు చాకలి ఉమా ప్రచార కార్యదర్శి చెరుకు మమత చందూలాల్ షాద్నగర్ టౌన్ అధ్యక్షులు తంగిడిపల్లి శంకర్ ప్రధాన కార్యదర్శి భూషణ్ నరేష్ అసెంబ్లీ యువజన ఉపాధ్యక్షులు శివ ముదిరాజ్ షాద్నగర్ ప్రధాన కార్యదర్శి మల్కాపురం రవి. ఫరూక్నగర్ మండల అధ్యక్షులు మేకల వెంకటేష్ అసెంబ్లీ కన్వీనర్ పసుపుల సత్యం షాద్నగర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెంది తిరుపతిరెడ్డి చెన బాల్రాజ్ నరేందర్ శివ బాస రాజేందర్ పాలాభి అంజనేయులు భువనగిరి భాస్కర్. తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments