
-జాతరను తలపించిన బేతిగల్ గ్రామం..
పయనించే సూర్యడు // మార్చ్ // 5 // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ // కుమార్ యాదవ్..
వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో బుధవారం రోజున భూలక్ష్మి, మహాలక్ష్మి,బొడ్రాయి, జాతర ఘనంగా నిర్వహించడం జరిగింది.యాగశాల ప్రవేశం, శాంతి పాఠం, కుంభ ఆవాహన, ఆరాధన, అహహిత దేవత వాహనం, విగ్రహాలకు పంచామృతాభిషేకం చేసుకున్న సందర్భంగా , గ్రామ దేవతల ప్రతిష్ట ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగగా, గ్రామ ప్రజల సమక్షంలో ఆడబిడ్డలు మంగళహారతుల గ్రామదేవతలైన భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి దేవతల అనుగ్రహంతో, అష్టదిక్పాలకులు దద్దరిల్లిలా, గ్రామ దేవతలకు అర్చనలు, అభిషేకాలు గ్రామం పేరు చెప్పు, సంకల్ప బలంతో హిందూ సంప్రదాయబద్ధంగా, హైందవ ధర్మంతో కూడిన మంత్ర, శాస్త్ర యుక్తంగా బ్రాహ్మణులు పూజలు జరిపిస్తూ, సకల దేవతల అనుగ్రహం గ్రామానికి ఉండాలని, సకల దోషాలు పోయి, సకల శుభాలు కలిగి, గ్రామంలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పాడిపంటలతో, సిరిసంపదలతో, కలిగి ఉండాలని. అనంతరం గ్రామ ప్రజలు మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.