పయనించే సూర్యుడు న్యూస్
చివ్వెంల మండల ప్రతినిధి బి.వెంకన్న జనవరి 13/1/25
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుర్రం తండా గ్రామంలో దారుణం కన్న కూతురు పై సైకోతండ్రి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఇద్దరు భార్యలకు సైతం టార్చర్ వేధింపులు తాళలేక భర్తను హతమార్చిన ఇద్దరు భార్యలు ఈ సంఘటన చివ్వెంల మండలం గుర్రం తండా గ్రామంలో చోటు చేసుకుంది మద్యానికి బానిసై చెడు వ్యసనాలకు అలవాటు పడి కూతురుతో అసభ్యంగా ప్రవర్తించడం ఇది గమనించిన తల్లులు భర్తకు ఎన్నిసార్లు చెప్పినా వాళ్లని టార్చర్ పెట్టడం తట్టుకోలేక సోమవారం తెల్లవారుజామున భర్తను హతమార్చిన ఇద్దరు భార్యలు,ఘటన స్థలానికి చేరుకున్న స్థానిక సూర్యాపేట డి.ఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.