
హార్ష్యం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు.
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
షాద్ నగర్ పట్టణానికి చెందిన న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ విద్యార్థి నీరా దినేష్ గౌడ్ బ్లాక్ బెల్ట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరచడం జరిగింది.ఇందులో భాగంగా అంబేద్కర్ జయంతి సందర్బంగా విద్యార్థికి కోచ్,మాస్టర్స్ బాలరాజ్,అహ్మద్ ఖాన్(బ్రూస్ లీ)సత్యనారాయణ స్వామి దేవాలయం వద్ద అవార్డ్ ప్రధానోత్సవం చేయడం జరిగింది.ఈ సందర్బంగా బాలరాజ్ మాస్టర్ మాట్లాడుతూ ,, ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో బాల బాలికలకు కుంగ్ ఫు,కరాటే లో శిక్షణ ఇవ్వడానికి తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలని తెలిపారు.అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో అహ్మద్ ఖాన్(బ్రూస్ లీ)మాస్టర్ విద్యార్థినీ,విద్యార్థులు పాల్గొన్నారు.
