
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్)
కేశంపేట మండలం అల్వాల గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రగడ్డతండాకు చెందిన భద్రునాయక్(80) కుటుంబాన్ని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆదివారం ఉదయం పరామర్శించారు. భద్రునాయక్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తండాకు చేరుకొని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి తక్షణ సహాయంగా కొంత నగదును అందజేశారు. అధైర్యపడవద్దని అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో అల్వాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు తిరుమల్ రెడ్డి శ్రీనివాస్, సుధాకర్, రాజు, మద్దూరి మల్లేష్ యాదవ్, కుమ్మరి సత్యనారాయణ, మద్దూరి కృష్ణయాదవ్, మెతుకుపల్లి సుదర్శన్, నారాయణ, తదితరులు పాల్గొన్నారు..