
పయనించే సూర్యుడు// న్యూస్ జూలై 9 // నారాయణపేట జిల్లా బ్యూరో
స్కూల్ ఎర్త్ క్లబ్స్ యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాం లో భాగంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ మరియు తెలంగాణ విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హై స్కూల్ జాజాపూర్ పాఠశాలలో ఔషధ వనాన్ని ఏర్పాటు చేశారు. డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రఫీ యుద్దీన్ మాట్లాడుతూ ఔషధ మొక్కల విలువల గురించి ఉపయోగించే పద్ధతి గురించి విద్యార్థులకు వివరించారు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఔషధ మొక్కలు ఉండాలని వాటి విలువలు తెలుసుకోవాలని చెప్పారు. అలాగే జిల్లా సైన్స్ అధికారి భాను ప్రకాష్ మాట్లాడుతూ భవిష్యత్తు బాగు కోసం పుడమి నాయకులను తయారు చేద్దామని అన్నారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలని,నీటి విలువ గురించి తెలుపుతూ సి.జి.ఆర్. బృందం వివరించారు, అనంతరం పాఠశాలలో నిర్మించిన ఇంకుడు గుంత నిర్మాణాన్ని ఏ విధంగా నిర్మించాలనే పద్ధతిని విద్యార్థులకు వివరించారు. పాఠశాలకు తులసి, అలోవెరా, గోరింటాకు, లెమన్ గ్రాస్, బ్లాక్ టర్మిక్, శంఖ పుష్ప, అశ్వగంధం, సరస్వతి, కిడ్నీ టీ ప్లాంట్ నల్లేరు, వివిధ మొక్కలను పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుభారతి, విజయ మధుసూదన్ రావు ప్రతాప్ నిర్మల శశిరేఖ నర్సింలు ఉపాధ్యాయుల బృందం, సిజిఆర్ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
