
ప్రయాణించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్
నరసింహపురం గ్రామ పెద్దలు, కొమరం భీమ్ యూత్ కమిటీ సభ్యులు
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం చిడుమూరు పంచాయతీ నరసింహపురంలో గ్రామ పెద్దలు, కొమరం భీమ్ యూత్ సభ్యులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘనంగా నిర్వహించారు, అలాగే గ్రామ పెద్దలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురించి గ్రామస్తులకు వివరించడం జరిగింది. గ్రామ పెద్దలు మాట్లాడుతూ నవ భారతి రాజ్యాంగ నిర్మత, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ గారి 134వ జయంతి గురించి గ్రామ పెద్దలు కొన్ని సూచనలు సలహాలు గ్రామస్తులకు యూత్ కమిటీ సభ్యులకు వివరించడం జరిగింది. ఆనాటి కాలంలో అంతా చదువు చదవడం మామూలు విషయం కాదు. ఆత్మవిశ్వాసంతో ఎంతటి విజయాన్నినైనా సాధించవచ్చు అని డాక్టర్ అంబేద్కర్ రుజువు చేశాడు. అలాగే ఎదగడానికి 7 మెట్లు అన్ని గుర్తు చేశారు, అవి ఆత్మవిశ్వాసం, స్వయంకృషి, దేశభక్తి, ఆత్మభిమానం, మనోబలం, పట్టుదల, క్రమశిక్షణ అని సూచించడం జరిగింది. అంబేద్కర్ ఉన్నతమైన చదువులు చదివి ఎంతో గొప్ప వ్యక్తి అయ్యారని అన్నారు. భరత రాజ్యాంగం రూపకల్పనతో దేశం చీకట్లో నుంచి వెలుగు వైపుకు వచ్చిందన్నారు, సమానత్వం సోదర భావం తో ప్రజలంతా స్వేచ్ఛ తో తమ ఆశయాలను అంబేద్కర్ ఆశయ సాధన లక్ష్యంతో ముందుకెళ్లాలని అన్నారు. ఆయన కలలు గన్న రాజ్యంలో మనమందరం ఉన్నామని చెప్పారు. ఈ అంబేద్కర్ జయంతికి గ్రామస్తులందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో గ్రామ పూజారి ముచ్చిక సింగయ్య, గ్రామ పటేల్, ముచ్చిక సీతయ్య, ముచ్చిక ప్రసాద్, కమ్మాల జయరాజు,ముచ్చిక రాజయ్య, చిన్నం రాంబాబు, ముచ్చిక లక్ష్మియ్య, కొమరం భీమ్ యూత్ ఉపాధ్యక్షులు ముచ్చిక వినోద్, కొమరం భీమ్ యూత్ సలహాదారులు, కాక సీతారామయ్య, ముచ్చిక బాలకృష్ణ, పద్దం అర్జున్, పద్దం మహేష్, యూత్ కమిటీ సభ్యులు, సాయి, చంటి, తెల్లం రవి, చిన్నం చంటి, అనిల్, ముచ్చిక గణేష్, దొరబాబు, మహిళలు, ముచ్చిక నరసమ్మ, ముచ్చిక, కాంతమ్మ, అనూష, శరణ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.