
పయనించే సూర్యుడు ఏప్రిల్ 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబ సమేతంగా నాలుగు రోజుల పాటు భారతదేశంలో పర్యటించనున్నారు. అమెరికా ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జేడి వాన్స్.. తొలి భారత పర్యటనకు ఈరోజు రానున్నారు. జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్, భారత సంతతికి చెందిన మొదటి అమెరికన్ మహిళ కావడం విశేషం.
భారత పర్యటనలో భాగం గా జేడి వాన్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావే శమై, భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక, వాణిజ్య ఒప్పం దాలు, భౌగోళిక రాజకీయ అంశాలు, ఇండో-పసిఫిక్ భద్రత, ఎ ఐ డ్రోన్ టెక్నాల జీలపై చర్చలు జరపనున్నారు. భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో కీలకమైనదిగా జేడి వాన్స్ భారత్ పర్యటనను భావిస్తున్నారు. వాణిజ్య ఒప్పందాలు, టారీఫ్‌లు, భౌగోళిక రాజకీయ అంశాలపై జరిగే చర్చలు రెండు దేశాల భవిష్యత్తు సహకారానికి దిశానిర్దేశం చేయనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ తన భార్య ఉషా వాన్స్, ముగ్గురు పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబెల్,తో కలిసి ఇవ్వాల్టి నుండి ఇరవై నాలుగు వరకు నాలుగు రోజుల భారత పర్యటనకు రానున్నారు. జేడీ వాన్స్ సోమవారం ఉదయం పది గంటలకు ఢిల్లీలోని పాలమ్ ఎయిర్ బేస్‌కు చేరుకుంటారు. అక్కడ కేంద్ర విదేశాంగ మంత్రి ఆయనకు స్వాగతం పలుకనున్నారు. యుఎస్ వైస్ ప్రెసిడెంట్ అతని కుటుంబం ఢిల్లీలో ఐ టి సిమౌర్య షెరటన్ హోటల్‌లో బస చేస్తారు. పెంటగాన్, విదేశాంగ శాఖకు చెందిన వారితో సహా ప్రభుత్వంలోని ఐదుగురు సీనియర్ అధికారులు జేడి వాన్స్ వెంట భారత్ లో పర్యటించనుంది. సోమవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిముషాలకు లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధానమంత్రి నివాసంలో నరేంద్ర మోదీతో వాన్స్ సమావేశమవుతారు. ఇద్దరి మధ్య కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలో 2030 నాటికి భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఐదు వందల బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యంతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరగనున్నాయి.
అమెరికా విధించిన టారీఫ్‌ల వ్యవహారంపై కీలక చర్చలు జరిగే అవ కాశం ఉంది. అనంతరం వాన్స్ కుటుంబానికి విందు ఇవ్వనున్నారు ప్రధాని మోదీ.