
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో
ఈరోజు శనివారం రోజు న భీంగల్ మండల కేంద్రంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది బాల్కొండ నియోజకవర్గం లోని 17 గ్రామాల్లోని మరియు భీంగల్ మున్సిపల్ 10 వార్డులో మహిళా సంఘాల భవనాల మరమ్మతుల కొరకై, ఎస్ డి ఎఫ్ నిధులనుండి 28+4 మొత్తం 32 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది ఇందులోనుండి భీంగల్ మండలంలోని 11 గ్రామాలకు 17 లక్షలు మరియు భీంగల్ మున్సిపల్ 10 వార్డులో 4 లక్షలు మహిళా సంఘాల భవనాల మరమ్మత్తల కొరకై 21 లక్షల రూపాయల నిధులను కేటాయించడం జరిగిందని, ఇట్టి నిధుల మంజూరు చేయించిన బాల్కొండ కాన్స్టెన్సీ ఇన్చార్జి సునీల్ కుమార్ కి కృతజ్ఞతలు తెల్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొదిరే స్వామి,పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య,మాజీ ఎంపీపీ కన్నె సురేందర్,జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్,ఎస్సీ సెల్ అధ్యక్షులు అనంతరావు, ఎస్టీ సెల్ అధ్యక్షులు గోపాల్ నాయక్,బీసీ సెల్ అధ్యక్షులు రాజు,యువజన కాంగ్రెస్ మహేష్,సాయి బాబా,గంగాధర్,నల్లూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు