
పయనించే సూర్యుడు మే నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో
భీంగల్ పట్టణంలో రోజువారీగా జరిగే శానిటేషన్ పనులను శనివారం కమిషనర్ పరిశీలించారు. పట్టణంలో వివిధ వేరియాల్లో చెత్త సేకరిస్తున్న ట్రాక్టర్ ని పరిశీలించి డ్రైవర్లకు తగు సూచనలు చేశారు. పొడి చెత్తను తప్పనిసరిగా ఆర్ సి సెంటర్ కు తరలించాలని డ్రైవర్లను ఆదేశించారు పట్టణంలో మెయిన్ రోడ్ల వెంబడి ఎక్కడ చెత్త ఉండకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. వేసవికాలం దృష్ట్యా పనులు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని శానిటేషన్ వర్కర్లకు సూచించారు. తప్పనిసరిగా ఓ ఆర్ ఎస్ పాకెట్లను వారి వెంట ఉంచుకోవాలన్నారు. ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు కలిపిన మంచినీళ్లనే తీసుకోవాలని అన్నారు. వారి వెంట మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది ఉన్నారు
