
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండల్
ఈరోజు శనివారం రోజున మెండోరా గ్రామంలో ఎస్ సి కాలనీలో మండల పరిషత్ నిధులతో నిర్మించిన నూతన మంచినీటి ట్యాంకును ఈరోజు ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నీటి చుక్క విలువైనదే కనుక నీటిని పొదుపుకుని వాడుకుని మన ఇంటి అవసరాలను తీర్చుకోవాలని ఎప్పటికప్పుడు ట్యాంకు పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని అక్కడ ఉన్న కాలనీ మహిళలను కోరారు. గత రెండు సంవత్సరాల కాలంగా ట్యాంకు పూర్తిగా చెడిపోయి నీరు వృధాగా పోతుందని కొత్త ట్యాంకు మంజూరు కొరకై డిసిసి ప్రధాన కార్యదర్శి కుంట రమేష్ కి విన్నవించగా,ఈరోజు మా కాలనీ వాసుల నీటి సమస్య తీరిందని వారు సంతోషం వ్యక్తం చేశారు.ఈ ట్యాంకు మంజూరుకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ అన్న కి,కృషి చేసిన డిసిసి ప్రధాన కార్యదర్శి కుంట రమేష్ కి, పల్లె శేఖర్ కి, మంజూరు చేసిన ఎంపీడీవో సంతోష్ కుమార్ కి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. తదనంతరం అక్కడే నిర్మాణంలో ఉన్న పలు ఇందిరమ్మ ఇండ్లను ఎంపీడీవో సందర్శించడం జరిగింది. వీరితోపాటు పంచాయతీ సెక్రెటరీ ప్రశాంత్, కారాబర్ భోజ రెడ్డి, దీప్సన్,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేశ్వర్గౌడ్, ఉపాధ్యక్షులు ఎర్రన్న చాకలి గంగాధర్, షఫీ, పోషన్న, ఖదీర్, దిలీప్, భూపతి, అరుణ్,కోటేశ్వర్, భూమన్న, నారాయణ, పల్లికొండ నరేందర్, వడ్డే భూమేష్, చింతకుంట నరేందర్, టి గంగాధర్, దర్శింగ్,కమ్మరి గంగాధర్ ఎస్సీ కాలనీ మహిళలు మొదలగు వారు పాల్గొన్నారు
