
వాజేడు వ్యవసాయ శాఖ అధికారి. ముంజ మహేష్.
పయనించే సూర్యుడు: ఫిబ్రవరి 18; ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి.ఎ. వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని అరుణాచలపురం మరియు టేగులగూడెం గ్రామాలలోని రైతులకు భూసారా పరీక్ష పత్రాలప్రాముఖ్యత ను మండల వ్యవసాయశాఖ అధికారి ముంజ మహేష్ రైతులకు వివరించారు. ఆయన మాట్లాడుతూ భూసార పరీక్ష పత్రాల ఆధారంగానే సిఫారసు చేసిన పంటలను వేసుకొని, సిఫారసు మేరకు ఎరువులను వాడుకోవాలని తెలియజేశారు. ఎక్కువ మొత్తం లో ఎరువులు వాడితే భూమి పొరల్లో వున్న ఉపయోగపడే సూక్ష్మజీవులు చనిపోయి భూసారం తగ్గే అవకాశం ఉందని తెలిపారు. అంతేకాకుండా, జనుము, జీలుగా, పిల్లి పెసర వంటి పచ్చి రొట్ట ఎరువులు పంటకు ముందు వేసుకొని భూమి లో కలియదున్నీతే సేంద్రియ కార్బణం పెరగడంతో పాటు భూమి సారవంతం అవుతుందని తెలియ జేశారు. ప్రస్తుతం ఉన్న పంటలు కోతలు అయిపోయన తర్వాత వేసవి కాలంలో వ్యవసాయ శాఖ తరుపున భూసారా పరీక్షల కొరకు మట్టి నమూనాలు మళ్ళీ సేకరిస్తామని అన్నారు. ఈయొక్క కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారు లు హరీష్,జాఫర్ మరియు రైతులు పాల్గొన్నారు.