
ఈ రోజు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల దౌల్తాబాద్ లో మండల విద్యాధికారి మరియు ఫిజికల్ డైరెక్టర్ విష్ణు గారి ఆధ్వర్యంలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహణ సమావేశం మండలంలోని వ్యాయామ ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ గేమ్స్ విజయవంతంగా నిర్వహించాలని విద్యార్థులకు మంచి ప్రోత్సాహాన్ని అందించాలని మండల విద్యాధికారి అన్నారు.ఆగస్టు 25,26,మరియు 28 తేదీలలో ఖో ఖో, కబడ్డీ, వాలీబాల్ ఆటలు నిర్వహించడం జరుగుతుంది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కి వేదిక ఎంజేపీ గురుకుల పాఠశాల లింగరాజ్ పల్లి మరియు బాలుర ఉన్నత పాఠశాల దౌల్తాబాద్.ఈ ఆటల్లో అండర్ -14,అండర్ -17 బాల బాలికలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు సురేష్,రవీందర్, మోహన్, అరుణ్,అనిత, ప్రత్యుష, చంద్రం పాల్గొన్నారు.