
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూలై 11
అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,రంపచోడవరం జ్యుడీషియల్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు నుండి అంబేద్కర్ సెంటర్ మీదుగా రంపచోడవరం జ్యుడీషియల్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు వరకు మధ్యవర్తిత్వం యొక్క ప్రయోజనాలను పై అవగాహన ర్యాలీ నిర్వహించామని జె.ఎఫ్.సి మెజిస్ట్రేట్ ఎం.మురళీ గంగాధర రావు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ,డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రాజమహేంద్రవరం ఆదేశాల మేరకు ర్యాలీ అనంతరం కోర్టు ప్రాంగణం నందు మధ్యవర్తిత్వం యొక్క ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.మధ్యవర్తిత్వం ద్వారానే సమస్యలు త్వరితగతిన సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమం ఈనెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మధ్యవర్తిత్వం యొక్క ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్యానల్ అడ్వకేట్స్ కు మరియు మండల న్యాయ సేవాధికార సంస్థ పారా లీగల్ వాలంటీర్లకు వ్యక్తం చేశారు.ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి జాతీయ న్యాయ సేవా లీగల్ సర్వీసెస్ అథారిటీ టోల్ ఫ్రీ నెంబర్ 15100 కు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ నాగమల్లేశ్వర రావు,బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏ ఆర్.భగవాన్,అడ్వకేట్ ఎం.వి.ఆర్.ప్రకాష్ అడ్వకేట్ వై. శ్రీనివాస్,అడ్వకేట్ ఏ.వి.సత్యనారాయణ,అడ్వకేట్ గౌరీ శంకర్,అడ్వకేట్ జిలాని, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రాజమహేంద్రవరం,మండల న్యాయ సేవాధికార సమస్త పారా లీగల్ వాలంటీర్లు యలగాడ నాగేశ్వరరావు,తెల్లం శేఖర్,కారం రామన్న దొర మరియు కోర్టు సిబ్బంది,పోలీసులు మరియు ప్రజలు పాల్గొన్నారు.
