
పయనించే సూర్యుడు:ఏప్రిల్11:ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి రామ్మూర్తి.ఎ.
వాజేడు :బహుజన్ సమాజ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు తడికల శివకుమార్ : ఈరోజు వాజేడు మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు కారం చిరంజీవి ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి కార్యక్రమమును ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు తడికల శివకుమార్ హాజరై మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ సాధనకై బహుజనులంతా ఐక్యంతో ఉద్యమించాలని అన్నారు. భారతదేశంలో అణచివేయబడ్డ బహుజన కులాలకు మరీ ముఖ్యంగా మహిళలకు విద్య అందించడం కోసం జీవితాంతం కృషి చేసినటువంటి మహాత్మ జ్యోతిరావు భారత దేశపు మొదటి మరియు చివరి మహాత్ముడని కొనియాడారు. భారత రాజ్యాంగం రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ నా గురువు మహాత్మ పూలేనని ప్రకటించిన విషయాన్ని బహుజనులు గుర్తుంచుకోవాలని అన్నారు. మహాత్మా పూలే ఆశయ సాధనకు బహుజనలంతా ఉన్నత విద్యను అభ్యసించి ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో పురోభివృద్ధి చెంది దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మత మైనారిటీ మరియు మహిళలు అందరూ బహుజనులని, బహుజన అనే పదాన్ని మహాత్మ పూలేనే.. ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థను కూల్చేందుకు నిర్మూలించేందుకు వాడారని గుర్తు చేశారు. మహనీయులు సాధించిన ఫలాలు మనువాద బిజెపి ప్రభుత్వ పాలన వల్ల ప్రమాదంలో పడ్డాయని మహనీయులు సాధించిన హక్కులు రక్షించుకునేందుకు అందరూ ఏకమై రాజ్యాంగాన్ని రక్షించుకొని, తద్వారా తమకు తామే రక్షణ కల్పించుకునేలా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గం అధ్యక్షులు కుమ్మరి రాంబాబు, భహుజన సమాజ్ పార్టీ వాజేడు మండల ఉపాధ్యక్షులు దుర్గం దేవ సహాయం, ప్రధాన కార్యదర్శి జనగం కేశవరావు కోశాధికారి జాడి రమ్య, కార్యదర్శి సాధన పల్లి మోహన్ రావు, ఈసీ మెంబర్ కుమ్మరి స్వర బాబు, జాడి సుజాత, కుమ్మరి ప్రేమ కుమారి, కుమ్మరి ఏసు తదితర బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు

