
పయనించే సూర్యుడు న్యూస్ జూలై 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ అధికారానికి దూరమై రెండేళ్లు కావొస్తుంది.. రాష్ట్రంలో పదేళ్లు అధికారం చెలాయించిన గులాబీ బాస్.. మరో ఐదేళ్లు తామే అధికారంలో ఉంటామని భావించారు.
కానీ.. ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ లెక్కలన్నీ తారుమారు అయ్యాయి. అప్పటివరకు వంద సీట్లు గెలుస్తామని ధీమాలో ఉన్న గులాబీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. అయితే ఎన్నికలకు ముందే కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ టికెట్లను కొత్త వారికి ఇద్దామని కేటీఆర్ మొత్తుకున్న కేసీఆర్ వినిపించుకోలేదని ప్రచారం జరిగింది. కానీ తీరా అధికారం కోల్పోయాక.. వాస్తవాన్ని ఇప్పుడు గ్రహించి.. పార్టీ ఇంచార్జ్‌లను మార్చేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ తరపున ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇందులో పదిమంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిపోగా.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆకస్మికంగా మృతి చెందారు. ఇందులో కంటోన్మెంట్‌లో నియోజకవర్గం ఒకటి.. ఈ నియోజకవర్గంలో బైపోల్ జరిగితే.. అక్కడ అధికార పార్టీ జెండా పాతింది. తాజాగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి ఇక్కడ కూడా ఉప ఎన్నిక జరగబోతోంది. దాంతో ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీకి ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇక ఓడినా నియోజకవర్గాల్లోనూ కొందరు నేతలు అధికార పార్టీలో చేరితే.. మరికొందరు నేతలు మృతి చెందారు.. ఇంకొందరు నేతలు రాజకీయంగా సైలెంట్ అయ్యారు. ఇవన్నీ గులాబీ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితులు ఇలాగే కంటిన్యూ అయితే.. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి మరోసారి అధికారం కష్టమేనన్న భావన బలపడుతోందట.. అందుకే కనీసం ముప్పై నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను వెతికే పనిలో గులాబీ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ కొత్తవారికి ఇంచార్జ్‌లుగా అవకాశం దక్కలేదు. అక్కడ ఇంచార్జ్ పోస్టు కోసం చాలామంది లీడర్లు పోటీ పడ్డప్పటికీ.. గులాబీ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఆలస్యం అమృతం విషం అన్న భావనకు కేసీఆర్‌కు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ పది నియోజకవర్గాల్లో వీలైనంత త్వరగా కొత్త నేతలకు అవకాశం ఇచ్చేందుకు పలువురు నేతల పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొందరు గులాబీ లీడర్లు జనాలను పట్టి పీడించుకున్నారనే టాక్ ఉంది. వారి అనుచరుల అవినీతి అక్రమాలు, ఎమ్మెల్యేల అహంకారం.. పార్టీ బాగా మైనస్ అయ్యిందని బాస్ భావిస్తున్నారట. ఈ సంఖ్య దాదాపు పది హేను నుంచి ఇరవై వరకు ఉండొచ్చని అంటున్నారు. వీరిని కూడా తప్పక మారిస్తే.. తప్ప మరో అవకాశం లేదని లెక్కలు వేసుకుంటున్నారట. అందుకే వీళ్లకు కూడా గుడ్‌బై చెప్పేసి కొత్త ముఖాల కోసం కేసీఆర్ వేట మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ప్రస్తుతమున్న మాజీ ఎమ్మెల్యేలనే వచ్చే ఎన్నికల వరకు కంటిన్యూ చేద్దామని గులాబీ బాస్ భావించారట. కానీ చివరి నిమిషంలో మాత్రం వారిని మార్చేసి కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలని అనుకున్నారట. అయితే వచ్చే ఎన్నికలకు వరకు పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. పార్టీకి మరింత నష్టం తప్పదనే భావనకు గులాబీ బాస్ వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే వారిని తప్పించి.. కొత్తవారికి అవకాశం ఇవ్వాలని లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తంమీద అధికారం కోల్పోతేగానీ వాస్తవంలోకి రానీ గులాబీ బాస్.. స్థానిక సంస్థల ఎన్నికల లోపు కొత్త ఇంచార్జ్‌లకు బాధ్యతలు అప్పగించి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది.. చూడాలి మరి కేసీఆర్ నిర్ణయంపై గులాబీ లీడర్లు ఊరుకుంటారా..! లేక బీఆర్‌ఎస్‌ను వీడి ఆధికార పార్టీలో చేరిపోతారా అనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాలి. అని అన్నారు