
//పయనించే సూర్యుడు// న్యూస్// మార్చ్ 16// మక్తల్.రిపోర్టర్ సీ.తిమ్మప్ప//
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని మార్చి 17, 18 రెండు రోజులపాటు ధర్నా 48 గంటల వంటవార్పు కార్యక విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి గోవింద్ రాజ్ పిలుపునిచ్చారు శనివారం రోజు మక్తల్ ఐసిడిఎస్ సిడిపిఓ కార్యాలయంలో ఈ విషయమై వినతిపత్రం అందజేసి ఆయన మాట్లాడారు ఐసిడిఎస్ను నిర్వీర్యం చేసే పీఎం శ్రీ ని మొబైల్ సెంటర్స్ ను ,ఎన్ ఇ పి ని. వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా అంగన్వాడీలకు కనీస వేతనం 18000 అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ననుసరించి అంగన్వాడీలకు గ్రాటివిటీని గుజరాత్ హైకోర్టు తీర్పు మేరకు పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం కోసం నారాయణపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు దగ్గర రెండు రోజులపాటు జరిగే వంట వార్పు కు ధర్నా కార్యక్రమంలో మక్తల్ ప్రాజెక్టులోని అంగన్వాడీ టీచర్లు మినీ టీచర్లు హెల్పార్లు అందరూ పాల్గొంటున్నట్లు సి డి పి ఓ కు ఇచ్చిన వినతి పత్రంలో వారు పేర్కొన్నారు ఈ వినతి పత్రం అందజేసిన వారిలో మంజుల, డి విజయలక్ష్మి సుజాత భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు
