పయనించే సూర్యుడు జనవరి 13హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి
కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో పి ఆర్ టి యు టీఎస్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం దామోదర్ రెడ్డి తో కలిసి వాకర్స్ తో సమావేశమయ్యారు ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే మార్చిలో జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో కరీంనగర్ నిజామాబాద్ అదిలాబాద్ మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి తాను పిఆర్టియుటిఎస్ అధికారిక అభ్యర్థిగా బరిలో ఉంటున్నానని తనను మీరందరూ ప్రధమ ప్రాధాన్యత ఓటుతో ఆశీర్వదించాలని వాకర్స్ ను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అయిలేని కరుణాకర్ రెడ్డి మర్రి జైపాల్ రెడ్డి కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి,తిరుపతిరెడ్డి మరియు మండల,జిల్లా, రాష్ట్ర బాధ్యులు లక్ష్మీనారాయణ, బీరయ్య, నాగేశ్వరరావు, జీవన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, శ్యాంసుందర్, శ్రీకాంత్ రావు, శ్రీనివాస్, మల్లారెడ్డి, సతీష్, సత్యనారాయణ రెడ్డి లతోపాటు పలువురు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు సోదర సంఘ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
మార్నింగ్ వాక్ లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మహేందర్ రెడ్డి
RELATED ARTICLES