
మియాపూర్ జాతీయ రహదారిపై ఆక్రమణ తొలగింపు వారం రోజులు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది:ట్రాఫిక్ సీఐ జి. ప్రశాంత్
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 12 పయనించే సూర్యుడు ప్రతినిధి (ఎస్ఎం కుమార్) శేరిలింగంపల్లి నియోజక వర్గం పరిధిలోని మియాపూర్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 6 00 నుండి ఇరువైపులా జాతీయ రహ దారిపై ఆక్రమించి పలు చిన్నాచితక వ్యాపారులు కొనసాగిస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందుగానే స్పెషల్ డ్రైవ్ లో భాగంగా బుధవారం రోజు నుండి పలు శాఖల అధికారులను వెంట తీసుకొని పలు చిన్నాచితక వ్యాపారులను రోడ్డుపై నుండి జెసిబి ల ద్వారా తొలగింప చేశామని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. ఈ తొలగింపు కార్యక్రమంలో మియాపూర్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ తో పాటు సిబ్బంది, ఇతర జిహెచ్ఎంసి సంబంధించిన సంబంధిత సిబ్బంది అక్కడికి చేరుకొని తొలగింపు కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. బుధవారం రోజు ప్రారంభమైన తొలగింపు కార్యక్రమం ఈరోజు నుండి మరో వారం రోజులపాటు కొనసాగుతుందని తెలిపా రు. లింగంపల్లి పోలీస్ స్టేషన్ కు ఎదురుగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న లైవ్ ఓవర్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టాపిక్ మరింత సులభంగా వారి గమ్యాలకు చేరేందుకు ఈ నియ మాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నట్లు ఆయన మీడియా మిత్రుల తో స్పష్టం చేశారు. ఆక్రమణలను జిహెచ్ఎం సి కమిషనర్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ ఆక్రమణలు కొనసా గుతాయని తెలి యజేసినట్లు ఇన్స్పె క్టర్ పేర్కొన్నారు .పట్టణ ప్రణాళిక విభాగం టాపిక్ శాంతి పద్ధతుల పోలీసు పథకాల బందోబస్తుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిం చారు