
పయనించే సూర్యుడు మే 21 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి మండలంలో మీ సేవ నిర్వాహకుల తో టేకులపల్లి తహసిల్దార్ పి ముత్తయ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మీసేవ సెంటర్లు బినామీలతోని నడుస్తున్నట్లుగా సమాచారం వచ్చిందని కులము, ఆదాయం, డేట్ అఫ్ బర్త్, సంబంధిత సర్టిఫికెట్లకు సంబంధించిన సేవలకు నిర్ణయించిన రుసుము మాత్రమే వసూలు చేయాలని అంతకుమించి ఎక్కువ డబ్బులు తీసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చిన వెంటనే అట్టి మీసేవ యొక్క ఆర్థరైజేషన్ తొలగిస్తామని వారు తెలియజేశారు. ఎవరైనా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలియజేశారు, రేషన్ కార్డుల కొరకు ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్న వారు మరల మీ సేవలో సెంటర్ లో దరఖాస్తు చేసుకోవద్దని వారు తెలియజేశారు. రేషన్ కార్డు విషయంలో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని వారు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మీసేవ నిర్వాహకులు సిబ్బంది పాల్గొన్నారు.