
ఔట్ సోర్సింగ్ మరియు చిరు ఉద్యోగులకు జీతాలు పెంచాలి
ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ డిమాండ్
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఏప్రిల్ 30
మే డే కార్మిక దినోత్సవము రోజున ప్రభుత్వం చిరు ఉద్యోగులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఒక మంచి నిర్ణయాన్ని ప్రకటించాలని ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తుష్టి జోగారావు డిమాండ్ చేశారు అతి తక్కువ జీతంతో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శానిటేషన్ ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది, ఆరోగ్య శ్రీ, సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది, స్కూల్ లలో పని చేస్తున్న టీచర్స్, వంట పని వాళ్ళు ఇలా చాలా రకాల ఉద్యోగులు అతి కొద్ది జీతం తో ప్రభుత్వ సంస్థలలో 10 నుండి 15 సంవత్సరాలు పని చేస్తున్నారు వీరందరూ చాలా తక్కువ జీతంతో పని చేస్తున్నారు, సంవత్సరాలు గడుస్తున్న వారి జీతం పెరగడం లేదు, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఉన్న ప్రభుత్వాలు ఎక్కడ అమలు చేయకుండా కార్మికులను, ఉద్యోగులను శ్రమ దోపిడీ చేస్తున్నాయి, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాల్సి ఉండగా వారిని కూడా రెగ్యులర్ చేయడం లేదు, మెడికల్ డిపార్ట్మెంట్ లో ఐతే రెగ్యులర్ ఉద్యోగుల కన్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు, ఈ ప్రభుత్వంలో అయిన సమాన పనికి సమాన వేతనం ఇస్తారు అని కూటమి ప్రభుత్వం మీద కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు, ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచి పొతుంది, ఉద్యోగులకు సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు ఇది ఇలాగే కొనసాగితే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు వస్తాయని చాలా మంది ఉద్యోగులు భావిస్తున్నారు, కాబట్టి ఈ మే డే సందర్భంగా అయిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాల పెంపు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులర్ అనే అంశాలపై ఒక నిర్ణయాన్ని ప్రకటించాలని ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తరుపున పత్రిక ప్రకటన ద్వారా ప్రభుత్వ కోరుతున్నామని అన్నారు