
(సూర్యుడు సెప్టెంబర్ 6 రాజేష్)
దౌల్తాబాద్, ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి దేవుడి లావణ్య నరసింహారెడ్డి ఆధ్వర్యంలో శనివారం దౌల్తాబాద్ శివాజీ చౌరస్తాలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని జిఎస్టి స్లాబ్ లను తక్కువ చేశారని దీనితో నిత్యవసర వస్తువులను మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. నిత్యవసర వస్తువులపై సామాన్యులకు జీఎస్టీ తగ్గించడం వల్ల నిరుపేద సామాన్య ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నరసింహ రెడ్డి, గడ్డమీది స్వామి, సత్యనారాయణ గౌడ్, చిక్కుడు స్వామి, బాను, రమేష్, స్వామి, రాంరెడ్డి, స్వామి గౌడ్, శ్రీశైలం, బాస్కర్ రెడ్డి, బాల్ రాజ్, ప్రవీణ్, బోరింగ్ శ్రీను, పులుగారి స్వామిగౌడ్, ప్రతాప్ రెడ్డి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు..