
పయనించే సూర్యడు // మార్చ్ // 5 // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ // కుమార్ యాదవ్..
మ్యాన్ కైండ్ అగ్రిటెక్ వారి ఆధ్వర్యంలో వీణవంక గ్రామంలో రైతు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. రబి సీజన్లో వరి , మొక్క జొన్న పంటల లో తరుచుగా వచ్చే వేరుకుళ్ళు, కాండం కుళ్ళు, అగ్గి తెగులు సమస్యలు గురించి రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బ్లూ ష్యూర్ డెవలప్మెంట్ హెడ్ రితురాజ్ శర్మ సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో తెలంగాణ రీజినల్ మేనేజర్ కె.వి రమణారెడ్డి ,సీనియర్ టెరిటరీ మేనేజర్ పి. సందీప్ , సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఏ. సందీప్ రెడ్డి రైతు సేవక్ అగ్రీమాల్ ప్రోపెటర్ ఎమ్. కోటేశ్వర రావు, సురేష్ రెడ్డి. ఫీల్డ్ సుప్రవైజర్ జి.చంద్రమౌళి రైతులు శ్రీనివాస్, గెల్లు కొమురయ్య, శ్రీనివాస్, సది, విష్ణు, కుమార్, రాజేందర్, పున్నంచందర్ తో పాటు వంద కు పైగా రైతులు పాల్గొన్నారు.
